

తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే “రెండు జడల జమున” అనే ఫోక్ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్రలహరి ఈవెంట్స్ సమన్వయంలో విడుదల చేశారు. ప్రత్యాగ్ర మ్యూజిక్ పరడైస్ మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఫోక్ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలంగాణ భాషా శైలి, గ్రామీణ నేపథ్యం, సంప్రదాయ సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ పాటకు మహీమదన్ సంగీతం అందించగా, నాగరాజు సాహిత్యం రాశారు. బొద్దు దిలీప్ మరియు ప్రభ ఈ పాటను ఆలపించారు. వీడియోలో మాధురి రాథోడ్, రాజేష్ జాగ్వార్ ప్రధాన పాత్రల్లో నటించారు. విశ్వ పరిష్ మరియు జి.వి. ప్రవీణ్ కుమార్ ఈ పాటకు దర్శకత్వం వహించగా, జె.పీ. విజయన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. సుమారు రూ.10 లక్షల వ్యయంతో రూపొందిన ఈ ఫోక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది. అలాగే ప్రత్యాగ్ర మ్యూజిక్ ఛానల్ తన ఆదాయంలో 10 శాతం సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

.png&w=3840&q=75)













.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!