

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ప్రిత్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ పోస్టర్లో ప్రిత్విరాజ్ చేతులు, కాళ్లు పక్షవాతం చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. అయితే ఆయన కూర్చున్న వీల్‌చైర్‌లో ఉన్న మెకానికల్ ఆర్మ్స్ ఆయన శక్తికి మూలం అవుతాయనే సంకేతం ఇస్తుంది. రాజమౌళి, పృథ్వీరాజ ను “సినిస్టర్, రూత్‌లెస్, పవర్ఫుల్” అని వర్ణిస్తూ, “తాను చూసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు” అని ప్రశంసించారు.
అయితే సోషల్ మీడియాలో ఈ లుక్‌పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది అభిమానులు పృథ్వీరాజ్ కొత్త లుక్‌ను మెచ్చుకోగా, మరికొందరు గత సినిమాల విలన్లను పోలి ఉందని విమర్శించారు. నెటిజన్లు ‘కుంభ’ పాత్రను ‘క్రిష్ 3’లో వివేక్ ఒబెరాయ్, ‘24’లో సూర్య పాత్ర అథ్రేయ, ‘ఫ్లాష్’లో డాక్టర్ హారిసన్ వెల్స్, ‘ఎక్స్‌మెన్’లో ప్రొఫెసర్ చార్లెస్ జేవియర్ పాత్రలతో పోల్చారు.
ఇంకా కొందరు ఈ లుక్‌ను ‘స్పైడర్‌మ్యాన్ 2’లోని డాక్టర్ ఆక్టావియస్ పాత్రతో పోలుస్తూ వ్యాఖ్యానించారు.
మూవీపై ఉన్న భారీ అంచనాల నడుమ ఈ ఫస్ట్ లుక్ నిరాశ కలిగించిందని చాలామంది భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సినిమా టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌ను జియోహాట్‌స్టార్‌లో లైవ్‌స్ట్రీమ్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ షూట్ జరుపుకుంటోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!