

భారత స్వాతంత్ర్య సమరంలో అజరామరమైన నాయకుడిగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ జెమిని ఫిలిం సర్క్యూట్ ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకుడు ఆనంద్ వి. ప్రసాద్ తెరకెక్కించనున్నారు. ‘సుభాష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నేతాజీ పాత్రను యువ నటుడు ఆర్యన్ శ్యామ్ పోషించనున్నారు. తాజాగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
స్వాతంత్ర్య ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)లో ఆయన నాయకత్వం, దేశభక్తి మరియు చారిత్రక సేవలను విస్తృత పరిశోధనల ఆధారంగా ఈ చిత్రంలో చూపించనున్నారు. నేతాజీ పాత్రలో నటించడం తనకు అరుదైన అవకాశమని ఆర్యన్ శ్యామ్ పేర్కొన్నారు. యువతలో దేశసేవ పట్ల స్పూర్తి నింపే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!