
జనరల్

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ పూర్తి చేసినట్లు తెలిసింది. కొరటాల శివ ఆయన కోసం ప్రత్యేకంగా శక్తివంతమైన పాత్రను రూపొందించగా, బాలకృష్ణ ఈ చిత్రంలో ఎప్పుడూ చూడని విధంగా కొత్త లుక్లో కనిపించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం బలమైన సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. రాజకీయ అంశాలకు కూడా ఇందులో ముఖ్యమైన స్థానం ఉండనుంది. వచ్చే నెల 10 న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు విడుదలయ్యే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!