

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా ఈ నెల 14 న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి, ది రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టి పోటీగా నిలిచి, కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. వారం పూర్తికాకముందే హౌస్‌ఫుల్ బుకింగ్స్‌తో ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటి, నవీన్ పొలిశెట్టి 100 కోట్ల గ్రాస్ హీరోల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు . ఈ విజయం ఆయన భవిష్యత్ సినిమాలు, రెమ్యునరేషన్, ఇతర విషయాలపై ఆసక్తిని పెంచింది.
నవీన్ పొలిశెట్టి సినీరంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టడం, ఇప్పుడు గుర్తింపు, గౌరవాన్ని సంపాదించడం విశేషం. స్టాండప్ కమెడియన్, యాంకర్, సింగర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్, హీరోగా ఆల్‌రౌండర్ గా గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుండి ఎదురైన సమస్యలు, అసంతృప్తులు, కష్టాలను అధిగమించి, 10 వ తరగతిలోనే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసుకుని, తల్లిదండ్రుల ఆదేశాల ప్రకారం ఇంజనీరింగ్ పూర్తి చేసి, సినిమాల్లో అడుగు పెట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ప్రాథమిక అడుగు పెట్టిన తరువాత డీ ఫర్ దోపిడీ, వన్ నేనొక్కిడినే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, చిచ్చోరే, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి చిత్రాలతో యువతలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రత్యేకంగా జాతిరత్నాలు ఆయనను సీనియర్ హీరోలతో పోల్చదగ్గ స్థాయికి తీసుకొచ్చింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!