

టాలీవుడ్ యువ నటి అనుపమ పరమేశ్వరన్, నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో నరేష్ పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
నేటి కాలంలో పెళ్లి చేసుకోవడం అవసరమా అనే ప్రశ్నకు స్పందించిన నరేష్.. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం రెండూ వ్యక్తిగత నిర్ణయాలేనని అన్నారు. సహజీవనం కూడా తప్పు కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పెళ్లిళ్లు భారీ ఖర్చుతో కూడిన వేడుకలుగా మారాయని, వివాహాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న కొందరు, విడాకుల సమయంలోనూ పెద్ద మొత్తాలు వెచ్చిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నించినప్పటికీ చాలామందికి వివాహాలు కుదరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేకపోతే ఆ నిర్ణయాన్ని గౌరవించవచ్చని, అయితే పిల్లలను కనడం ముఖ్యమని నరేష్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!