

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భద్రపరిచిన పవిత్ర బ్రహ్మ కమలం చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ సూచిస్తోంది. ఆ దివ్య వస్తువును చేజిక్కించుకునేందుకు ప్రయత్నించే దుష్టశక్తులు, వాటిని అడ్డుకునే ఆధ్యాత్మిక శక్తుల మధ్య సాగే పోరాటం కథకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.
శివుడి ఆవిర్భావం, నాగసాధువుల ప్రవేశం, నాగబంధం అనే దివ్య రక్షణ శక్తి చుట్టూ కథ విస్తరించడం ట్రైలర్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అద్భుతమైన విజువల్స్, భారీ సెట్లు, ఉన్నత స్థాయి గ్రాఫిక్స్, జునైద్ ఖాన్ మరియు అబే అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నగర్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం భారీ స్థాయి సినీ అనుభూతిని అందిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!