

భారీ విజువల్స్‌తో రూపొందుతున్న ‘నాగ బంధం’ చిత్రం ట్రైలర్ విడుదల తర్వాత సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ, అడ్వెంచర్, భక్తి అంశాలను కలగలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుందనే సంకేతాలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.
ట్రైలర్ ఆరంభం నుంచే అద్భుతమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. భారీ సెట్టింగ్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వినియోగం, విజువల్ ట్రీట్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే కథాంశం సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. రహస్యాలు, సాహసాలు, పురాణ నేపథ్య అంశాలను కలిపి కథను ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. విరాట్ కర్ణ తన పాత్రలో ఉత్సాహభరితంగా కనిపించగా, గరుడ రవి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతున్న సంకేతాలు కనిపించాయి. ప్రతినాయకుల పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ సూచిస్తోంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్ కలిసి ప్రతి ఫ్రేమ్‌ను మరింత గ్రాండ్‌గా మార్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!