

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ స్పెషల్ కానుక అందించేందుకు సిద్ధమవుతోంది యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాకిల్’. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఈ నెల 16 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ హంగులతో రూపొందుతోంది. సినిమా పేరు చెప్పినట్లే ‘మిరాకిల్’ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించబోతోందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రంలో రణధీర్ భీసు హీరోగా నటిస్తుండగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా కనిపించనున్నారు. మరో హీరోయిన్గా ఆకాంక్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు.
ఇక ఇతర నటీనటులు – నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌తోనే ఆసక్తిని పెంచిన ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్ ఈ నెల 16న విడుదల కాబోతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నెలకొనే అవకాశముంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!