
రాజకీయాలు

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్రసీమలో మెగాస్టార్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో విజయాలు, రికార్డులు, వైవిధ్యమైన పాత్రలు ఆయన ప్రయాణంలో భాగమయ్యాయి.
తరతరాల ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్న చిరంజీవి.. తెలుగు సినిమాకు తనదైన ముద్ర వేశారు. ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ అభిమానులు రూపొందించిన ప్రత్యేక సీడీపీ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు, వైవిధ్యమైన పాత్రలు, గుర్తుండిపోయే చిత్రాలతో చిరంజీవి సినీ ప్రస్థానం కొనసాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!