

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వారణాసి’ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. షూటింగ్‌కు ముందు ప్రత్యేక రిహార్సల్స్ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ షెడ్యూల్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబుతో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!