
రాజకీయాలు

విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహించారు. ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జూలై 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేకపోయింది.
ఇక ‘నాగబంధం’ తర్వాత దర్శకుడు అభిషేక్ నామ, నిర్మాతలు తమ తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌తో సినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు శర్వానంద్‌తో చర్చలు కూడా జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!