

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రంలోని భారీ మాస్ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్లో ఈ స్టైలిష్, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్‌ను చిత్రీకరిస్తున్నారు. మొదటి సింగిల్ “మీసాల పిల్ల” ఇప్పటికే 72 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో స్క్రీన్ షేర్ చేయడం ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా మారింది.
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బీట్స్ అందించగా, పొలకి విజయ్ కొరియోగ్రఫీ చేశారు. 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ సాంగ్‌ను కలర్, రిథమ్, వైబ్‌లతో కార్నివాల్‌లా తీర్చిదిద్దారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే చిరంజీవి – నయనతారపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ విడుదలకు కూడా మేకర్స్ సిద్ధమవుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!