

తెలుగు సినిమా మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినీ పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయిలో చరిష్మా కలిగిన నటుడు ఎవరు అన్న ప్రశ్న వస్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందుంటుంది. మహేష్ బాబు లుక్స్, పర్సనాలిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఆయనను గ్లోబల్ సినిమాల్లో చూడాలని అభిమానులు చాలా కాలం నుంచే కోరుకుంటున్నారు.
ఈ కోరిక నిజం కావడానికి సరైన సమయం, సరైన వ్యక్తి కావాల్సి వచ్చింది. ఆ అవకాశం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపంలో వచ్చింది. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న “వారణాసి” అంతర్జాతీయ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఇటీవల హాలీవుడ్ మీడియా, సోషల్ మీడియా పేజీలు కూడా “వారణాసి” పై ఆసక్తికరంగా మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ హాలీవుడ్ యాక్షన్ ఐకాన్ జాన్ విక్ను తలపిస్తోందని అక్కడి ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు.
దాంతో హాలీవుడ్ ప్రేక్షకుల్లో మహేష్ బాబు ఇమేజ్ రిజిస్టర్ అవ్వడం ప్రారంభమైంది.
ఇది ఆయన గ్లోబల్ ఎంట్రీకి కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పాలి.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
Mahesh’s global rise has officially begun