

యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసిలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో ప్రియాంకా చోప్రాతో కలిసి ఓ ఉత్సాహభరితమైన పాటలో కనిపించనున్నారు. మందాకినిగా ప్రియాంకా నటిస్తుండగా, పాట పూర్తయ్యాక రుద్రతాండవం చేస్తూ విలన్స్పై భారీ యాక్షన్ సీన్ ఉండనుందని సమాచారం. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేశ్ బాబు సుమారు ముప్పై నిమిషాల పాటు శ్రీరాముడిగా కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక దాదాపు నెలరోజుల పాటు సాగే భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ ఫైట్ సన్నివేశాల కోసం మహేశ్ బాబు విదేశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొననున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!