
జనరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానం అందించారు. భోపాల్‌లో జరుగుతున్న ‘పెద్ది’ భారీ మ్యూజికల్ ఈవెంట్ సందర్భంగా సీఎం నివాసంలో ప్రత్యేక టీ మీట్ నిర్వహించగా, అనంతరం రామ్ చరణ్ మరియు ‘పెద్ది’ చిత్రబృందం గ్రాండ్ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్‌లో ప్రత్యేకంగా ఏఆర్ రెహమాన్ సంగీత వేడుక కూడా ఉండనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు చిత్రబృందం భారీ ప్లానింగ్ చేస్తోంది. రామ్ చరణ్ భోపాల్ టూర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!