
టెక్నాలజీ

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని పూర్తి కుటుంబ కథా చిత్తరువుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 15న సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం వెంకటేష్, చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద గారు’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో తన షూట్ భాగాన్ని పూర్తి చేసిన వెంటనే, వెంకటేష్ ఈ త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి జాయిన్ కానున్నారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!