
జనరల్

ప్రస్తుతం ఓ సినిమా ప్రకటించినప్పటి నుంచే వరుస అప్డేట్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం సాధారణంగా మారింది. అయితే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎలాంటి అధికారిక ప్రకటన, ప్రచార హడావుడి లేకుండానే తన కొత్త సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.
'గమ్యం' సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన క్రిష్‌కు ఇటీవల వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!