
జనరల్

తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన సోనా హైడెన్ మరోసారి సీనియర్ హాస్యనటుడు వడివేలుపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. వడివేలు అద్భుతమైన నటుడని, ఆయన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌కు సాటి ఎవరూ లేరని ప్రశంసించిన ఆమె, వ్యక్తిత్వం విషయానికి వస్తే మాత్రం తాను మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు.
వడివేలుతో కలిసి నటించే 16 సినిమాల అవకాశాలను తానే స్వయంగా తిరస్కరించానని సోనా తెలిపారు. డబ్బు కంటే తన ఆత్మగౌరవమే ముఖ్యమని, గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే భిక్షమెత్తుకోవడానికైనా సిద్ధమే కానీ రాజీ పడనని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!