

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ, రెండేళ్ల విరామం తర్వాత ‘కమ్‌బ్యాక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగా కూడా కొత్త బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 21న తన పుట్టినరోజు సందర్భంగా చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన కార్తికేయ.. ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన బాక్సర్ పాత్రలో కనిపిస్తూ స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. కార్తికేయ లుక్, ఫిట్‌నెస్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయన భార్య లోహితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా కార్తికేయ స్వయంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా కార్తికేయ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!