29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆహార నాణ్యతలో నిర్లక్ష్యంపై రెండు సంస్థలకు వినియోగదారుల కమిషన్‌ షాక్‌

Writer: Pooja 06:22 AM, 29 అక్టోబర్, 2026
ఆహార నాణ్యతలో నిర్లక్ష్యంపై రెండు సంస్థలకు వినియోగదారుల కమిషన్‌ షాక్‌

కలుషిత వెన్న విక్రయించిన కేసులో సైనిక్‌పురిలోని రత్నదీప్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తయారీ సంస్థ అక్షయ కల్పా ఫార్మ్స్‌ అండ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. ఫిర్యాదు చేసిన వినియోగదారురాలికి రూ.లక్ష పరిహారం, మరో రూ.లక్ష జరిమానా, రూ.10 వేల కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. వెన్న కొనుగోలు కోసం ఆమె చెల్లించిన రూ.230ను కూడా తిరిగి ఇవ్వాలని తీర్పునిచ్చింది. కాప్రాకు చెందిన సంధ్య గత ఏడాది జనవరి 28న రూ.230 చెల్లించి అక్షయ కల్పా ఆర్గానిక్‌ కుకింగ్‌ బటర్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ తెరిచి చూడగా బూజు, కంటికి కనిపించే స్థాయిలో కలుషిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై దుకాణ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో తయారీ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఆశ్రయించారు. తయారీ సంస్థ నిర్వహించిన తనిఖీలో దుకాణం సిఫారసు చేసిన నిల్వ ఉష్ణోగ్రతను పాటించలేకపోతున్నట్లు గుర్తించిన విషయాన్ని కమిషన్‌ ప్రస్తావించింది.

వెన్నను 4 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలని, మూసివేసిన శీతలీకరణ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, సిబ్బందికి కోల్డ్‌ చైన్‌ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది. తాము కేవలం విక్రయదారులమని రత్నదీప్‌ సంస్థ వాదించగా, ఫిర్యాదు అందిన తర్వాత తనిఖీలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చామని అక్షయ కల్పా సంస్థ తెలిపింది. అయితే ఉత్పత్తి నాణ్యతను కాపాడటంలో రెండు సంస్థలూ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కమిషన్‌ నిర్ధారించింది. కలుషిత ఆహార పదార్థాల విక్రయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను హైదరాబాద్‌ ఫోరం-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పీవీటీఆర్‌ జవహర్‌బాబు, వాల సుమలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

 అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

 అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ
ట్యాగ్లు
వినియోగదారుల కమిషన్కలుషిత వెన్నరత్నదీప్‌ రిటైల్అక్షయ కల్పాఆహార భద్రతవినియోగదారుల హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ

 తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉదయం కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

తొలి ట్రాన్స్ మహిళా వైద్యురాలిగా ఘనత సాధించిన డాక్టర్ రూత్ జాన్ పాల్‌కు సజ్జనార్ సత్కారం
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
జనరల్

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!
జనరల్

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్
జనరల్

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

 అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
జనరల్

అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

 అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

‘ది ప్యారడైజ్’ విమర్శల తర్వాత శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం...
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విమర్శల తర్వాత శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం...

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ
జనరల్

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ

 తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష
జనరల్

తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!