29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష

Writer: Pooja 06:45 AM, 29 అక్టోబర్, 2026
 తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష

ఆర్నబ్‌ అతితీవ్ర తుఫాన్‌ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పగలు, రాత్రి సమీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం 6.15 గంటలకు క్యాంప్‌ కార్యాలయం నుంచి కలెక్టర్లతో మరోసారి మాట్లాడిన సీఎం, అనంతరం రాష్ట్ర సచివాలయంలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రం నుంచి సమీక్ష నిర్వహించారు. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంపై అధికారులు వివరాలు అందించారు. పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, వాగులు, కాలువలు, ఇతర నీటి ప్రవాహ మార్గాలు పొంగిపొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కలిపి సుమారు 32 వేల మందితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అధికారుల పనితీరును ప్రశంసించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాత్రంతా పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించాలని ఆదేశించారు. చిన్న నీటిపారుదల చెరువుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని, సాగునీటి సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని, తుఫాన్‌ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని, పరిస్థితులు పూర్తిగా కుదుటపడిన తర్వాతే వారిని ఇళ్లకు పంపాలని స్పష్టం చేశారు. పంటలు, ఉద్యాన పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.

ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులను సీఎం సమీక్షించారు. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వివరించారు. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాను వేగంగా పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బందిని పంపాలని సీఎం ఆదేశించారు. రహదారులపై అడ్డంకులను త్వరగా తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని సూచించారు. ప్రజలు సమస్యలను తెలియజేయడానికి ఉపయోగించే ‘మనమిత్ర’ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

 అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

 అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుతుఫాన్ సహాయక చర్యలుఆంధ్రప్రదేశ్ఆర్టీజీఎస్ సమీక్షవిద్యుత్ పునరుద్ధరణవిపత్తు నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
జనరల్

ఏపీలో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!
జనరల్

తాగునీరు వృథా చేస్తే చర్యలు తప్పవు - జలమండలి హెచ్చరిక!

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్
జనరల్

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం - రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

 అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
జనరల్

అనకాపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

 అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన

‘ది ప్యారడైజ్’ విమర్శల తర్వాత శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం...
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విమర్శల తర్వాత శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం...

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ
జనరల్

నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా? ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఉత్కంఠ

 తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష
జనరల్

తుఫాన్‌ సహాయక చర్యలపై చంద్రబాబు నిరంతర సమీక్ష

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం
జనరల్

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం

 తెలంగాణలో కరువు మండలాల ఎంపికపై బండి సంజయ్‌ విమర్శలు
రాజకీయాలు

తెలంగాణలో కరువు మండలాల ఎంపికపై బండి సంజయ్‌ విమర్శలు

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసులపై కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు
జనరల్

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసులపై కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!