

బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పలువురు సన్నిహిత సినీ ప్రముఖులను అన్‌ఫాలో చేయడం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, మలైకా అరోరా, మనీష్ మల్హోత్రా, అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి ప్రముఖులను అన్‌ఫాలో చేయడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన కరణ్ జోహార్, ఇది పూర్తిగా తన "డిజిటల్ డీటాక్స్"లో భాగమేనని స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపే సమయం, శక్తిని తగ్గించుకునేందుకే ఎక్కువ మందిని అన్‌ఫాలో చేసినట్లు కరణ్ తెలిపారు. సోషల్ మీడియాలో దీనిని పెద్ద వార్తగా చూపించడం అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కేవలం కొద్ది మంది వ్యక్తులను మాత్రమే ఫాలో అవుతున్నారు. మరోవైపు, నిర్మాతగా పలు కొత్త చిత్రాలతో బిజీగా ఉన్న కరణ్ జోహార్, సోషల్ మీడియాలో మాత్రం తన సమయాన్ని పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!