

భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. నేపాల్ అభివృద్ధి కోసం భారత్ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. నేపాల్ కరెన్సీలో రూ.24 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్యాకేజీని అందించనున్నట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడంతో పాటు నేపాల్ అభివృద్ధికి తోడ్పాటు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో చర్చలు జరిపిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది గంటల చర్చల్లోనే నేపాల్ భవిష్యత్తుపై బాలేంద్ర షాకు ఉన్న స్పష్టమైన దృక్పథం, నిబద్ధత తనకు అర్థమయ్యాయని మోదీ పేర్కొన్నారు. భారత్-నేపాల్ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన ఆలోచనలను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, అభివృద్ధి భాగస్వామ్యానికి ఈ చర్చలు మరింత బలాన్నిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!