17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య జోర్డాన్ నుండి తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ టీమ్!

Writer: Krishna Priya 07:44 PM, 28 ఫిబ్రవరి, 2026
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య జోర్డాన్ నుండి తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ టీమ్!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రతరమవుతోంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు దాడుల నేపథ్యంలో యుద్ధ భయం మరింత పెరిగింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ ఎనిమిది దేశాల్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు సమాచారం. పరిస్థితుల దృష్ట్యా ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులు, పర్యాటకులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.

ఈ పరిణామాలు టాలీవుడ్‌లో కలకలం రేపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ ఇటీవల జోర్డాన్‌లో కొనసాగింది. అయితే అక్కడి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన చిత్ర యూనిట్ ఈ నెల 22కే తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగివచ్చింది. ఒకవేళ షూటింగ్ మరికొన్ని రోజులు కొనసాగి ఉంటే, ఎన్టీఆర్‌తో పాటు వందలాది మంది సిబ్బంది అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉండేది. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి హైలైట్‌గా నిలిచే కీలక సన్నివేశాలు, ఎడారి ప్రాంతాల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ డూప్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేయడం విశేషం. ఒక మాస్ సాంగ్‌ను కూడా అక్కడే తెరకెక్కించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో యుద్ధ పరిస్థితులు మరింత ప్రభావం చూపుతాయేమోనని ఆందోళన నెలకొంది. అయితే విదేశీ షెడ్యూల్ దాదాపు పూర్తవడంతో ఇక మిగిలిన చిత్రీకరణ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ తదితర భారతీయ లొకేషన్లలో జరగనుంది. దీంతో సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం ఉండదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన కెరీర్‌లో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్‌లో దర్శనమివ్వనుండగా, ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

ట్యాగ్లు
పశ్చిమాసియా ఉద్రిక్తతలుఇరాన్ అమెరికా దాడులుఇజ్రాయెల్ యుద్ధంజోర్డాన్ హెచ్చరికలుభారత రాయబార కార్యాలయంఎన్టీఆర్ప్రశాంత్ నీల్డ్రాగన్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం
రాజకీయాలు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరు
రాజకీయాలు

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరు

వదలా థ్రిల్ పంచిందా... లేక నిరాశపరిచిందా?
రివ్యూలు

వదలా థ్రిల్ పంచిందా... లేక నిరాశపరిచిందా?

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత
సినిమాలు

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?
సినిమాలు

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!
క్రీడలు

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!