
గాసిప్స్

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఈసారి వారికి కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాపకు ఉపాసన జన్మనిచ్చారు.
ఈ శుభవార్తను చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ట్వీట్లో తల్లి, ఇద్దరు శిశువులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ కుటుంబంలోకి మరో ఇద్దరు కొత్త సభ్యులు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
అలాగే, తమ కుటుంబంపై అభిమానులు ఎప్పుడూ చూపించే ప్రేమకు, ఆదరణకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లీం కారా అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఆమె 2023 జూన్ 20 న జన్మించింది. ఇప్పుడు కవలలతో ఈ కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!