

ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘ఇడుపు కాయితం’ విడుదల తేదీ ఖరారైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. టైటిల్ ప్రకటనతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలంగాణ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.
సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర బృందం శుక్రవారం ‘గడప’ పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ పాటకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించగా, అభినయ శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చారు. తేలు విజయ ఈ పాటను ఆలపించారు. విడాకుల పత్రం అనే అర్థం వచ్చే ‘ఇడుపు కాయితం’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలంగాణ కుటుంబ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ ప్రకటనతో పాటు తాజాగా విడుదలైన పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!