

కీర్తన్ గౌడ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా హారర్ థ్రిల్లర్ ‘418’లో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో అగ్ర కథానాయకుడు ప్రభాస్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య జరిగిన సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాల్లో కనిపించే తరహాలోనే ‘418’లోనూ డార్క్ థీమ్ ఉండటంతోనే ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారా? అని ప్రభాస్ సరదాగా ప్రశ్నించారు.
దీనికి ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘‘మరి ఇది ‘రాధేశ్యామ్’లా తీస్తే బాగుండదు కదన్నా’’ అంటూ పంచ్ వేశారు. దీంతో ప్రభాస్ కూడా సరదాగా స్పందిస్తూ.. ‘‘సలార్ 2 షూటింగ్‌లో చెబుతా’’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ చమత్కార సంభాషణ ‘418’ ప్రమోషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ సరదా మాటలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!