
క్రీడలు

“నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం…” అంటూ శక్తివంతమైన డైలాగ్‌తో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జయకృష్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడిగా ఘట్టమనేని కుటుంబం నుంచి ఆయన వెండితెరపై అడుగుపెడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, యాక్షన్ సన్నివేశాలు, పాటలతో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల్లోనూ, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. తొలి సినిమానే అయినప్పటికీ జయకృష్ణ నటనపై చిత్రబృందం పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తోంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మించారు. రషా థడానీ కథానాయికగా నటిస్తోంది. జులై 9న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాతో జయకృష్ణ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాడో అన్నది ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!