
జనరల్

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ చిత్రం సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తొలి గీతం ‘జయ జయ రామ్’ను గణేశ్ చతుర్థి సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ‘మన సత్యం.. మన చరిత్ర’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ భక్తిగీతానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చగా, డాక్టర్ కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించారు. అరజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాటలో సీతారాముల కల్యాణం, వనవాసం తదితర ఘట్టాలను ఆవిష్కరించారు. రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి 2026 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!