

నటులు సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సెప్టెంబర్ 11న వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వేడుక నిర్వహించుకున్న ఈ జంట.. తమ వివాహ ప్రమాణాలను మరోసారి పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో జ్యోతిక తెల్లటి గౌను ధరించగా.. సూర్య తెల్లటి జాకెట్, నల్లటి ప్యాంట్‌లో కనిపించారు.
ఈ సందర్భంగా జ్యోతిక తమ 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది పరిపూర్ణమైన దాంపత్యానికి సంబంధించిన వేడుక కాదని.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుబాట్లు, త్యాగాలు, నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా ఈ వేడుకను నిర్వహించుకున్నామని తెలిపారు. ఒకరి కోసం మరొకరు మారిన వ్యక్తిత్వాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని పేర్కొన్నారు. తనను తాను గౌరవించుకోవడం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి తనను గౌరవించినప్పుడు జీవితం గొప్ప బహుమతిగా మారుతుందని సూర్యను ఉద్దేశిస్తూ జ్యోతిక పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!