

రవి తేజ హీరోగా వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టైటిల్ ఇప్పుడు బాగా చర్చలో ఉంది. అసలు తెలుగులో “విజ్ఞాప్తి” అనేప్పుడు V తో మొదలవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్లో W వాడటం చాలా అరుదు. కానీ ఇది పొరపాటు కాదు… మేకర్స్ ఇష్టపూర్వకంగా చేసిన క్రియేటివ్ డెసిషన్ అంటున్నారు ఇండస్ట్రీలో.
ఇదంతా ఎందుకంటే… ఈ సినిమా షార్ట్ ఫామ్ BMW అంటూ పట్టాలని టీమ్ ప్లాన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా BMW అనే కార్ బ్రాండ్ ఫేమస్ కాబట్టి, ఆ కాంబినేషన్ పక్కాగా ఆకర్షణీయంగా ఉంటుందని వాళ్లు భావించారట. సాధారణంగా ఉండే BMV కంటే BMW చాలా ఆకట్టుకునేలా, ఈజీగా గుర్తుపడతారని అనుకున్నారు. అందుకే ఇలాంటి స్పెల్లింగ్ ఫైనల్ చేశారట.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవి తేజతో పాటు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ తదితరులు నటిస్తున్నారు. సంక్రాంతి 2026కి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్గా రాబోతుంది.




















కామెంట్స్ (2)
సినిమా టైటిల్ కూడా క్రియేటివ్ ఆలోచనతో ఆకట్టుకుంటోంది!
Interesting creative choice! Can't wait to see the movie!