

రాఘవ లారెన్స్ రూపొందించిన ‘ముని’, ‘కాంచన’ సిరీస్లు దక్షిణాదిలో హారర్ కామెడీ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. భయం, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ‘కాంచన 4’ పనులు ప్రారంభమవుతున్న వేళ.. ఈ సినిమాతోనే ఫ్రాంచైజీకి ముగింపు పలకాలనే ఆలోచనలో లారెన్స్ ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇక వరుసగా ఒకే తరహా కథలకంటే కొత్త కథలు, కొత్త ప్రపంచాలతో ముందుకు వెళ్లాలని లారెన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ‘కాంచన’ సిరీస్ కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కుటుంబ ప్రేక్షకుల్లో ఈ ఫ్రాంచైజీకి భారీ ఆదరణ ఉండటంతో ‘కాంచన 4’పై అంచనాలు పెరిగాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, హారర్ ఎలిమెంట్స్ మరింత కొత్తగా ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!