

భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రోమోల్లో మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ, సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో అదనపు లాభం లేకుండాపోయింది. తర్వాత వచ్చిన కింగ్డమ్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. పాత్ర పరిమితంగా ఉండటంతో భాగ్యశ్రీ ప్రతిభ బయటపడలేదు. కెరీర్ ప్రారంభంలోనే వరుస ఫ్లాప్లతో ఆమె నిలదొక్కుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నవంబర్లో విడుదల కానున్న రెండు సినిమాలు — కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా — పై ఆమె భారీగా ఆశలు పెట్టుకుంది. అందులో ముందుగా వచ్చిన కాంతకి తమిళంలో మంచి రివ్యూలు వచ్చినా, తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ, దుల్కర్, సముద్రఖని లాంటి భారీ నటుల ముందూ భాగ్యశ్రీ తన నటనతో గట్టిగా నిలిచింది. 1950ల నాటి కథానాయికగా ఆమె లుక్, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి రెండు సినిమాల్లో దర్శకులు ఆమెను సరిగా వినియోగించుకోకపోయినా, ఈ చిత్రంలో సెల్వమణి ఆమెను బాగా ప్రెజెంట్ చేశాడు. మొత్తం మీద కాంత ఫలితమేమైనా సరే, భాగ్యశ్రీకి మాత్రం ఇది పాజిటివ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!