

భారతీయ పురాణ గాథలను ప్రపంచ ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిగా అందించాలనే లక్ష్యంతో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. దాదాపు పది వేల మందికి పైగా సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు, విజువల్ ఎఫెక్ట్స్ బృందం ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొంటున్నట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇదేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచ స్థాయి సంస్థలు పని చేస్తుండగా, భారీ సెట్స్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. రావణుడి పాత్రలో యష్ నటించనున్న విషయం సినిమాపై మరింత హైప్ పెంచింది. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నాడనే వార్త కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసే అవకాశం ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!