

దోహా వేదికగా జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఆటతో పాటు మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. భారత యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాలను పాక్ ఆటగాళ్లు కవ్వించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హర్షిత్ రాణా, పాక్ స్పిన్నర్ సుఫ్యాన్ మోకిమ్ మధ్య జరిగిన వాగ్వాదం మ్యాచ్‌లో ఉద్రిక్తతను పెంచింది. రాణా ఔటై వెనుదిరుగుతున్న సమయంలో మోకిమ్ చేసిన వ్యాఖ్యలతో ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోగా, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
మరోవైపు, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ జట్టు 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్ నవాజ్ 79, మాజ్ సదాకత్ 59, ఫర్హాన్ యూసఫ్ 56 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనలో భారత్-ఏ జట్టుకు అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 పరుగులతో శుభారంభం అందించగా, కెప్టెన్ తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులతో పోరాడారు. షాబాజ్ అహ్మద్ 56 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు నిలవలేకపోయారు. దీంతో భారత్-ఏ జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటై 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!