
జనరల్

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. విడుదలైన తొలిరోజే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్ నివేదిక అంచనా వేసింది. భారత్‌లో రూ.14.80 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
తొలిరోజు ‘ఇరుముడి’కి ఏపీ, తెలంగాణ నుంచి సుమారు రూ.15 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. కర్ణాటకలో రూ.1.50 కోట్లు, తమిళనాడులో రూ.34 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.36 లక్షల వసూళ్లు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. ఇక ఓవర్సీస్‌లో రూ.7 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.24.20 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!