

స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె ఇప్పుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒకరాజు సినిమాలో నటిస్తోంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్నది. అలాగే శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది.
ఇలాంటి సందర్భంలో, మీనాక్షి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, ఆమె మాట్లాడుతూ, “లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా నటించినందుకు నాకు ప్రశంసలు లభించాయి. కానీ కొందరు స్నేహితులు నన్ను భయపెట్టారు. కెరీర్ ప్రారంభంలోనే ఇలా భార్యగా లేదా బిడ్డకు తల్లిగా పాత్రలు చేయవద్దని వారు సూచించారు. ఎందుకంటే నువ్వు ఇలాంటి పాత్రలు చేయడం స్టార్ట్ చేస్తే నిన్ను అమ్మ, అక్క పాత్రలకే పరిమితం చేస్తారని అన్నారు. అయితే లక్కీ భాస్కర్ సినిమా కథ నచ్చి తల్లి క్యారెక్టర్ చేశాను. ఇక అటువంటి పాత్రలు వస్తే చేయలేనని చెప్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!