

యంగ్ హీరో హవిష్, విజయవంతమైన కమర్షియల్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
క్రిస్మస్ సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్లో హవిష్ స్టైలిష్‌గా, ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. మిడిల్ క్లాస్ మ్యాన్ గెటప్‌లో, యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నట్లుగా అతని లుక్ ఆకట్టుకుంటోంది. నవ్వులు పూయించే హ్యూమర్‌తో పాటు మల్టీ లేయర్ పాత్రలో హవిష్‌ను చూపిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత, పాండిచ్చేరిలో కీలకమైన సాంగ్ షూట్‌ను పూర్తి చేశారు. ఈ పాటకు విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేయగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!