

‘శుభం’ సినిమాతో విజయాన్ని అందుకున్న యువ నటుడు హర్షిత్ రెడ్డి ఇప్పుడు తన కొత్త చిత్రం ‘దీవాన’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్, పిచ్చి ప్రేమతో కూడిన ఇంటెన్స్ వన్‌సైడ్ లవ్ స్టోరీని సూచిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఇప్పటికే టీజర్ మరియు పాటల ద్వారా మంచి హైప్‌ను సంపాదించింది. ముఖ్యంగా కార్తీక్ ఆలపించిన “ఇది ప్రేమ… ఇది ప్రేమ…” పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి యువతను ఆకట్టుకుంటోంది. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ARHA Media మరియు V Studios బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ స్మేహా మనిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం అవుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!