

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, నటనతో ఆకట్టుకున్న నటి హన్సిక మోత్వాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఆమె తన భర్త వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో విభేదాల కారణంగా విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ముంబైలోని బాంద్రా కోర్టు ఈ విడాకులను ఖరారు చేసిందని కొన్ని వర్గాల్లో వార్తలు వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ నేపథ్యంలో హన్సిక తన సోషల్ మీడియాలో ఒక పంజాబీ సూక్తిని పంచుకున్నారు. ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా, సానుకూలంగా ముందుకు సాగాలని ఆ సందేశం సూచిస్తోంది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని భావిస్తున్నారు. హన్సిక మరియు సోహైల్ కతూరియా 2022 డిసెంబర్ 4 న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. ఆ వేడుక అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!