
న్యూస్

ప్రఖ్యాత సినీ నటుడు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం వారు నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట గ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యుడు రామ్మోహన్రావు వెల్లడించారు.
విజయ్ దేవరకొండ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు ప్రత్యేక రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని ఫామ్‌హౌస్‌ను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
వివాహానంతరం తొలిసారిగా స్వగ్రామానికి రానుండటంతో ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, అధికారులు సహా సుమారు ఐదు వేల మంది హాజరవుతారని నిర్వాహకులు పేర్కొన్నారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!