

గగన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘జంగా’ చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి వనిత కిలారి సమర్పిస్తున్నారు. త్రిగుణ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ గడ్డం కథ, కథనం అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో గగన్ బాబు సీఐ రోహిత్ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఇంటెన్స్ లుక్ సినిమా కథలో కీలకమైన పాత్రను సూచిస్తోంది. ప్రస్తుతం ‘జంగా’ షూటింగ్ చివరి దశలో కొనసాగుతుండగా, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు రానున్నాయి. కృష్ణ సౌరభ్ సంగీతం, వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!