
న్యూస్

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శనివారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన ‘తండేల్’ చిత్రంలోని అతని నటనకు గుర్తింపుగా తెలంగాణ గద్దర్ అవార్డు ప్రకటించబడటంతో స్టూడియోలో ప్రత్యేకంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘తండేల్’ చిత్ర నిర్మాత బన్నీ వాస్ కూడా పాల్గొని నాగచైతన్యకు అభినందనలు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నాగచైతన్య ప్రతిభను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేశారు. స్టూడియో ప్రాంగణం చప్పట్లు, హర్షధ్వనులతో మారుమోగింది. ఈ విజయం అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!