

వివాహం సింపుల్గా, ఆత్మీయుల మధ్య జరగాలని మొదట అనుకున్నానని నటి పునర్నవి తెలిపింది. అయితే, వారి ప్రేమ రెండు కుటుంబాలను కలిపిందని, ఆ కారణంగా పెళ్లి ప్రత్యేకంగా, సాంప్రదాయాలతో నిండుగా జరిగిందని చెప్పింది. పెళ్లి అనేది కేవలం ఆర్భాటం కాదని, ఇది మనసులో జరిగే ఒక ప్రత్యేక అనుభవమని ఆమె వివరించింది. స్త్రీ, పురుష శక్తుల కలయికగా ఈ బంధాన్ని భావిస్తున్నానని పేర్కొంది.
పెళ్లి సమయంలో కొన్ని సందేహాలు, ఆలోచనలు వచ్చినప్పటికీ, తన భాగస్వామిని చూసినప్పుడల్లా ప్రశాంతత కలిగిందని తెలిపింది. ఇద్దరం కలిసి ఎదగాలని, పరస్పరం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పింది.
సమయం కారణంగా కాదు, తాను సిద్ధంగా ఉన్నందువల్లే ఈ పెళ్లి జరిగిందని స్పష్టం చేసింది. చివరికి ఈ వివాహం నిజాయితీగా, అందంగా, అర్థవంతంగా జరిగిందని వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పునర్నవి తెలుగు బిగ్బాస్ సీజన్ 3 ద్వారా గుర్తింపు పొందింది. అలాగే ఉయ్యాల జంపాల, పిట్టగోడ, సైకిల్ వంటి సినిమాల్లో నటించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!