

సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు మాట్లాడుతూ ‘‘మేము ‘కాప్‌లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేయడం టీమ్‌వర్క్, సమన్వయంతో సాధ్యమైందని తెలిపారు. నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి విభాగం సమర్థంగా పని చేయడం, ముందస్తు ప్రణాళిక స్పష్టంగా ఉండటం వల్లే షూట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామని ఆయన చెప్పారు. ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ప్రతి సీన్‌పై స్పష్టతతో పనిచేయడం షూట్‌ను సులభతరం చేసిందని వెల్లడించారు.

తన సినీ ప్రయాణాన్ని వివరించిన కిషోర్, కెమెరా అసిస్టెంట్‌గా ప్రారంభించి హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి చిత్రాల్లో పనిచేయడం తనకు విలువైన అనుభవమని తెలిపారు. ఫిల్మ్ నుంచి డిజిటల్ మార్పులు, లెన్స్ ఎంపికలో రీసెర్చ్ ప్రాముఖ్యత, హాలీవుడ్-ఇండియన్ సినిమాల మధ్య తేడాలపై కూడా ఆయన వివరించారు. ప్రస్తుతం ‘ప్రేమకు నమస్కారం’, ‘మన డాక్టర్ బాబు’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!