

ఇటీవల వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు శ్రీను వైట్లతో మరో ప్రాజెక్ట్ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తొలుత ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
దీంతో నిర్మాత అనిల్ సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని శర్వానంద్ స్వయంగా కో-ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకూలంగా సాగితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకోవడం ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!