
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ హీరోగా విజయాలు సాధించిన తర్వాత ఇప్పుడు నిర్మాతగా కూడా అడుగులు వేయనున్నట్టు సమాచారం. ‘లవ్ టుడే’తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన ఆయన తన సొంత బ్యానర్‌లో తొలి సినిమాను నిర్మిస్తున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో మమితా బైజు ప్రధాన పాత్రలో నటించనున్నారని టాక్.
దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ చిత్రంలో కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. తక్కువ బడ్జెట్‌తో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఆశించిన విజయం సాధించకపోయినా ప్రదీప్ మార్కెట్ క్రేజ్ తగ్గలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!