

వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న టాలీవుడ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ‘సింగ్ గీతం’తో ప్రారంభమైన సానుకూల వాతావరణం, సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ విజయంతో మరింత బలపడింది. ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించింది. దీంతో పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది. 2026 తొలి అర్ధభాగాన్ని సమంత భారీ విజయంతో ముగించడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పుడు అందరి దృష్టి జూలై 10న విడుదల కానున్న అక్కినేని అఖిల్ చిత్రం ‘లెనిన్’పై పడింది. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం పూర్తవుతున్నా అఖిల్ ఇంకా ఒక భారీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆయన కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న సానుకూల పరిస్థితులు చిత్రానికి అదనపు బలంగా నిలవొచ్చు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ‘మా ఇంటి బంగారం’ నిరూపించింది. ‘లెనిన్’ కూడా మంచి టాక్ అందుకుంటే అఖిల్ మార్కెట్ బలపడటమే కాకుండా అక్కినేని అభిమానులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని అందించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!