
న్యూస్

ముంబై నగరంలోని జుహు ప్రాంతంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి నివసిస్తున్న ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల సమయంలో బైక్ పై వచ్చిన యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
దుండగుడు వరుసగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి వేగంగా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఐదు బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!